వెంకటేష్‌ను ఫాలో అవుతున్న టాలీవుడ్ యంగ్ హీరో
వెబ్ సిరీస్‌లకు ఒకప్పుడున్నంత క్రేజ్ లేదు. అలా అని వాటిని ఆదరించే వారేమీ తక్కువ లేరు. మంచి కంటెంట్ తో వస్తే ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తారనేది చాలా సిరీస్ లు నిరూపించాయి. సిరీస్ లో బూతులను పక్కన పెడితే రానా నాయుడు సిరీస్ కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ప్రస్తుతం రెండో సీజన్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది.
సీనియల్ హీరోల్లో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన మొదటి టాలీవుడ్ హీరోగా వెంకటేష్ స్పెషల్. ఇప్పుడదే దారిలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ వెళ్తున్నాడు. డీజే టిల్లు ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో నెట్‌ఫ్లిక్స్ నిర్మించనున్న భారీ బడ్జెట్ సిరీస్‌లో సందీప్ కిషన్ హీరోగా నటించనున్నట్లు సమాచారం. సందీప్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ లో కామియో చేసి డిజిటల్ ఎంట్రీ ఇచ్చాడు కానీ హీరోగా మాత్రం ఇదే అతని ఓటీటీ డెబ్యూ కానుంది. జానర్ ఏంటనేది ఇంకా తెలియదు కానీ క్రైమ్, సస్పెన్స్ ఆధారంగానే ఈ సిరీస్ ఉండనుందని తెలుస్తోంది. సౌత్ మార్కెట్ పై కన్నేసిన నెట్ ఫ్లిక్స్ ఓ వైపు భారీ బడ్జెట్ తో సినిమా హక్కులను కొంటూనే మరోవైపు ఇలా సౌత్ స్టార్లతో వెబ్ సీరిస్ లు కూడా ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగానే సందీప్ కిషన్ ప్రాజెక్ట్ సెట్ అయింది. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













