సుమంత్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
సుమంత్ పొరుగు కథలపై దృష్టి పెడుతున్నారు. కన్నడ చిత్రం కావలూడారి తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో డా.జి.ధనుంజయన్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో మొదలైంది. సుమంత్ సరసన నందిత, పూజాకుమార్ నటిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రమిది. కన్నడలో నటుడు పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారున. డా.ధనుంజయన్ తెలుగుతోపాటు తమిళంలోనూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ ఆంటోనీతో భేతాళుడు తెరెక్కించి విజయాన్ని అందుకొన్న ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్‌లో జరిగే సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేస్తాం. మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నాయి చిత్రవర్గాలు. నాజర్, జయప్రకాష్, సంపత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని కూర్పు: ప్రవీణ్ కె.ఎల్, పోరాటాలు: స్టంట్ సిల్వ, కళ: విదేశ్.













