టార్గెట్ పెట్టుకున్న సుకుమార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప2. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.
అయితే నార్త్ లో పుష్ప2 రైట్స్ ఈ సారి భారీ రేటుకు అమ్ముడయ్యే ఛాన్సుంది. పుష్ప2 ను ఆగస్ట్ 15న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించేశారు. కానీ షూటింగ్ మాత్రం చాలా స్లోగా జరుగుతుంది. ప్రతీ సీన్ ను పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే సుకుమార్ తను అనుకున్నట్లు షాట్ పర్ఫెక్షన్ ఉంటే తప్ప ముందుకెళ్లడం లేదట.
ప్రతీ సీన్‌ను పర్ఫెక్ట్ గా తీస్తూనే సుకుమార్ పుష్ప2 విషయంలో టార్గెట్ ను పెట్టుకున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో పుష్ప2 షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మే లోపు పూర్తి చేయాలని చూస్తున్నాడట. అలా అయితేనే తర్వాతి మూడు నెలలు సినిమా ప్రమోషన్స్ కు కేటాయించొచ్చని అనుకుంటున్నాడట సుకుమార్. ఈ నేపథ్యంలో పుష్ప2 షూటింగ్ కు ఎలాంటి బ్రేకులు ఇవ్వకుండా నిర్విరామంగా చేయనున్నాడట. ఏదేమైనా పుష్ప2తో మరోసారి అందరూ టాలీవుడ్ వైపు చూడటం ఖాయం.













