ఆ విషయంలో టెన్షన్ పడుతున్న సుకుమార్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అ సినిమాలో కేవశ క్యారెక్టర్ కు మంచి ఆదరణ అందుకున్నాడు. పుష్ప ఫ్రెండ్ పాత్రలో నటించిన ఈ క్యారెక్టర్ ఆడియన్స్‌కు బాగా గుర్తుండిపోయింది.
పుష్ప సినిమా కూడా కేశవ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మొదలవడం, కథ మొత్తాన్ని కేశవ క్యారెక్టరే నెరేట్ చేయించడం వల్ల ఆ క్యారెక్టర్ బాగా పండింది. అయితే తాజాగా ఓ అమ్మాయి సూసైడ్ కేసులో కేశవ ఇరుక్కున సంగతి తెలిసిందే. పోలీసులు కేశవను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నేరం కూడా ఒప్పుకోవడంతో రిమాండ్ కు పంపారు.
అయితే కేశవ అరెస్ట్ ఇప్పుడు పుష్ప టీమ్‌కు పెద్ద తలనొప్పిగా తయారైంది. పైకి సున్నితంగా కనిపించినా షూటింగ్ టైమ్ లో చాలా టెన్షన్ గా ఫీలవుతానని సుకుమార్ పుష్ప సక్సెస్ మీట్ లో చెప్పాడు. అలాంటిది ఇప్పుడు కేశవ వ్యవహారం సుకుమార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. సినిమాలో కేశవ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎలా బెయిల్ తీసుకురావాలని నిర్మాతలు ట్రై కూడా చేశారు.
కానీ స్వయంగా నేరం ఒప్పుకోవడంతో కేసు మరింత స్ట్రాంగ్ అయి బెయిల్ రావడం కష్టమవుతుంది. మరి ఈ టైమ్‌లో అతని క్యారెక్టర్ లేకుండా సినిమాను ఎలా పూర్తి చేయాలనేది సుకుమార్ కు అర్థం కాక టెన్షన్ పడుతున్నాడట. సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అవడంతో కొత్త క్యారెక్టర్ తో చేయలేరు. రీప్లేస్ చేయడం కూడా అంత ఈజీ కాదు. మరి ఈ సమస్యను సుక్కూ ఎలా సాల్వ్ చేస్తాడో చూడాలి.













