కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో తళుక్కుమన్న తారలు..
టాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ని టాలీవుడ్ ఎప్పుడు అక్కున చేర్చుకుంటుందనేది తెలిసిన విషయమే. యంగ్ టాలెంట్ ఎక్కడ ఉన్నా కూడా తెలుగు సినిమా మేకర్స్ గుర్తించి వెండితెరకు పరిచయం చేస్తుంటారు. యంగ్ టాలెంట్ ని హంట్ చేయడానికి షార్ట్ ఫిల్మ్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి తెలుగు నిర్మాతలకు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించి ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలుగుతున్న స్టార్స్ ఎంతో మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కెరీర్ స్టార్టింగ్ లో యూట్యూబ్ వేదికగా షార్ట్స్ ఫిల్మ్స్ లో నటించి తమ టాలెంట్ తో బిగ్ స్క్రీన్ పై సినిమాల్లో నటిస్తున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం.
రీసెంట్ గా టాలీవుడ్ లో ” రైటర్ పద్మభూషణ్ ” సినిమాతో సూపర్ హిట్టు కొట్టిన చిన్న సినిమా హీరో సుహాస్. కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. సుహాస్ నటించిన అతిధి షార్ట్ ఫిల్మ్ తనకి ఎంతో పేరుని తీసుకొచ్చింది. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ” కలర్ ఫోటో ” తో బంపర్ హిట్టు కొట్టి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా హీరోగా సెటిల్ అయిపోయాడు సుహాస్. రైటర్ పద్మభూషణ్ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమా అనుకోని విధంగా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.
కిరణ్ అబ్బవరం ఈ పేరుని టాలీవుడ్ ఆడియన్స్ కి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లోకి రాకముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు ఈ హీరో. అయితే అవి అంతగా కిరణ్ కి గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి. ” ఎస్.ఆర్ కల్యాణమండపం ” సినిమాతో టాలీవుడ్ లో మంచి సక్సెస్ ని అందుకున్నాడు ఈ హీరో. తాజాగా ” వినరో భాగ్యము విష్ణు కథ ” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటికే మీడియం హిట్ హీరోగా ఇండస్ట్రీలో సెట్ అయ్యాడు.
ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే తన లుక్స్ తో కుర్రకారుకి మత్తెకించే చాందిని చౌదరి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించి తర్వాత వెండితెరపై కి వచ్చింది. కలర్ ఫోటో సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. చూడడానికి పక్కింటి అమ్మాయిల కనిపించే చాందిని తెలుగు ప్రేక్షకులని ఫస్ట్ లుక్ తోనే కట్టిపడేసింది. ఇక అప్ కమింగ్ స్టార్స్ పూజిత పొన్నాడ, రీతూ వర్మ కూడా తమ కెరీర్ స్టార్టింగ్ లో షార్ట్ ఫిల్మ్స్ లో నటించి తర్వాత బిగ్ స్క్రీన్ పైకి వచ్చిన వాళ్ళే.













