రాజమౌళి, మహేష్ మూవీ అప్డేట్
మహేష్ బాబు, రాజమౌళి ల కాంబినేషన్ లో సినిమా రానుందనే విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ తోనే తన సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అప్పటి నుంచి వీరి కాంబినేషన్ లో ఏ సినిమా వస్తుందా అనే ఇంట్రెస్ట్ అందరిలో ఎక్కువైంది.
ఈ నేపథ్యంలోనే రాజమౌళి సినిమాలకు కథలను అందించే వ్యక్తి, తన తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేష్ కోసం ఒక జంగిల్ బేస్ట్ అడ్వెంచర్ స్టోరీ లైన్ అనుకున్నామని బాలవుడ్ మీడియాతో చెప్పాడు. రాజమౌళి, మహేష్ కలయికలో సినిమా ఉంటుందని తెలిసిన దగ్గరనుంచి రోజుకు ఏదో ఒకటి రూమర్ వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే మరో పుకారు కొత్తగా పుట్టుకొచ్చింది.
అది మరేంటో కాదు.. ఈ ప్రాజెక్ట్ ను ఈ యేడాది దసరాకు పూజా కార్యక్రమాలతో ఘనంగా స్టార్ట్ చేసి, సంవత్సరం ఆఖరికి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారంటున్నారు. సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా 2023 సంక్రాంతికి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్. కానీ ఇది కేవలం వార్తగానే మిగిలిపోయే ఛాన్సులు ఎక్కువున్నాయి. ఎందుకంటే రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నట్లు షూటింగ్ ఫినిష్ చేస్తున్నాడు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని మహేష్ తో సెట్స్ మీదకు వెళతాడు రాజమౌళి. ఇటు మహేష్ కూడా సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడంటున్నారు కాబట్టి, వీరిద్దరి సినిమా స్టార్ట్ అవడానికి టైమ్ పట్టే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. ఇన్నేళ్లకు రాజమౌళితో మహేష్ సినిమా చేస్తుండటంతో వీరి కాంబోపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.













