మహేష్ తో సినిమాకు తొందరేం లేదంటున్న జక్కన్న
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ మెప్పు పొందిన రాజమౌళి, ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, సూపర్ స్టార్ మహేష్ తో తను చేయబోయే సినిమాపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ మూవీ కాన్సెప్ట్‌ని రాజమౌళి డిసైడ్ చేశారు.
అడ్వంచర్ యాక్షన్ థ్రిల్లర్‌గా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. అడ్వంచర్ ట్రావెలర్‌గా మహేష్ ఈ సినిమాలో ఎలా కనిపించబోతున్నాడు? ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ, అది పూర్తయ్యాక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ ఏడాది ఆఖరికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ షాప్ మొదలయ్యే ఛాన్సుంది.
ఆర్ఆర్ఆర్ కు వచ్చిన ప్రపంచ మార్కెట్ దృష్టి మొత్తం ఇప్పుడు సూపర్ స్టార్ తో జక్కన్న చేయనున్న సినిమాపై పడనుంది. అది మహేష్ కు పెద్ద ప్లస్. అందుకోసమే ఈ సినిమా కోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ను కూడా ట్రై చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్న మహేష్ , ఆ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వెకేషన్ కు వెళ్లాడు.
మహేష్ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చాకే మళ్లీ ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. దాదాపు ఏప్రిల్, మే నెలల్లో షూటింగ్ ఉండకపోవచ్చంటున్నారు యూనిట్ సభ్యులు. అంటే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లేటవడం ఖాయం. త్రివిక్రమ్ సినిమా షూట్ లేట్ కావడం జక్కన్నకు బాగానే ఉపయోగపడుతుంది. కథని ఈ టైమ్ లో మంచి గ్రిప్పింగ్ గా రెడీ చేసుకోవచ్చు. ఏదేమైనా రాజమౌళి, పర్ఫెక్ట్ ప్లాన్ తో స్టోరీ రెడీ చేసుకుని మహేష్ తో సెట్స్ కు వెళ్లాలంటే బాగానే టైమ్ పట్టేట్లుంది.













