ప్రయోగాత్మక థ్రిల్లర్ గా తెలుగు కన్నడ భాషల్లో ‘ఆన్ ఎయిర్’ : హీరోగా దర్శకుడు శ్రీని
ఇటీవల కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో ఘోస్ట్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఎం జి శ్రీనివాస్ (శ్రీని) హీరో గా తెలుగు కన్నడ భాషల్లో ఇంటరెస్టింగ్ టైటిల్ ‘ఆన్ ఎయిర్’ అనే చిత్రానికి సంబంధించిన లోగో ఫస్ట్ లుక్ ఈ రోజు (మే 5న) విడుదల చేసారు. దర్శకుడు శ్రీని గతంలో బీర్బల్ ట్రోయిలోజి, ఓల్డ్ మాంక్ అనే బ్లాక్ బస్టర్స్ కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రం లో రేడియో జాకీగా శ్రీని నటిస్తున్నారు. రాజమౌళి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ వద్ద బాహుబలి చిత్రానికి రచయితగా పనిచేసిన ప్రశాంత్ సాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఓటిటి వేదికగా జులై నెలలో డైరెక్టుగా ఓటిటి వేదికగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.













