శ్రీలీల కంటే ఆమె మనసు ఎంతో అందమైనది
చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న హీరోయిన్ శ్రీలీల. ఒక చిన్న రోల్ అయినా సరే ఆమెతో చేయించుకోవాలని నిర్మాతలు ఆమె చుట్టు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం అమ్మడి చేస్తున్న సినిమాలన్నీ ఒకెత్తయితే మహేష్ తో చేస్తున్న గుంటూరుకారం ఇంకో ఎత్తు.
గుంటూరు కారం సక్సెస్ అయితే శ్రీలీల క్రేజ్ మరింత పెరిగిపోతుంది. చిన్న వయసులోనే అమ్మడి కెరీర్ చాలా స్పీడుగా ముందుకు వెళ్లడం కనీసం తను కూడా ఊహించి ఉండదు. అయితే శ్రీలీల నటిగానే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా కూడా అర్థమవుతుంది. తాజాగా అమ్మడుని పండగలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని అడిగితే దానికి శ్రీలీల చెప్పిన ఆన్సర్ అందరినీ షాక్ కు గురి చేసింది.
తనకు పండగలొస్తే అనాధలు గుర్తొస్తారట. వాళ్ల కోసం ఎవరూ ఉండరని, వాళ్ల రోజు ఎలా గడుస్తుందో తలచుకుంటేనే బాధేస్తుందని, అందుకే వీలున్నప్పుడల్లా అనాధాశ్రమాలకు వెళ్లి వాళ్లతో పండగ జరుపుకోవాలని ఉంటుందని, కుదిరితే తప్పకుండా వెళ్లి వాళ్లతోనే టైమ్ పాస్ చేసి, చేతనైనంత సాయం చేస్తానని, అదే పండగ వల్ల తనకు వచ్చే గొప్ప ఆనందంగా భావిస్తానని శ్రీలీల చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్న తర్వాత శ్రీలీల మనసు కూడా ఎంతో అందమైనదని అందరూ పొగిడేస్తున్నారు.













