మహేష్ సినిమాను లైట్ తీసుకున్న శ్రీ లీల
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ స్టోరీ పెళ్లి సంద-డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీ లీల ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. టాప్ హీరోయిన్ల క్రేజ్ తగ్గుతున్న టైమ్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల కోసం ఇప్పుడు టాలీవుడ్‌లోని స్టార్ హీరోలంతా వెంటపడుతున్నారు. శ్రీ లీల రీసెంట్గా చేసిన మూవీ ధమాకా.
మాస్ మహారాజా రవితేజ సరసన శ్రీ లీల నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. పాత కథే అయినా సినిమా ఎంటర్టైనింగ్గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే సినిమా వంద కోట్ల క్లబ్లో చేరింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీ లీలకు మంచి మార్కులు పడ్డాయి.
అందంతో పాటు అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన శ్రీ లీల వెంట ఇప్పుడు ఆఫర్లు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. నటనతో పాటు మంచి డ్యాన్సులతో కుర్ర కారును ఓ ఊపు ఊపుతున్న శ్రీ లీల డ్యాన్సులకు అందరూ మెస్మరైజ్ అవుతున్నారు. దీంతో ఆమెకు టాలీవుడ్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే రామ్- బోయపాటి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన శ్రీ లీల తనకున్న డిమాండ్‌ను బట్టి తన నెక్ట్స్ సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోందట.
అసలు విషయానికొస్తే ఈ సినిమాలతో పాటు శ్రీ లీల.. త్రివిక్రమ్- మహేష్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా నటించాల్సి ఉంది. మారిన స్టోరీ ప్రకారం పూజా హెగ్డే తో పాటూ ఇంకో హీరోయిన్ కావాల్సి ఉందట. ఎంతోమందిని పరిశీలించాక త్రివిక్రమ్ ఫైనల్‌గా శ్రీ లీలను అనుకున్నారట. సెకండ్ హీరోయిన్గా నటించడం ఇష్టం లేని శ్రీ లీల ఈ ప్రాజెక్ట్ ను లైట్ తీసుకుందని తెలుస్తోంది.













