ఆ వార్తలు పుకార్లు..ఎస్పీ చరణ్
తాజాగా చేసిన పరీక్షల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నెగటివ్ వచ్చిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఆ వార్తలను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఖండించారు. ఎస్పీకి కరోనా నెగిటివ్ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, కొందరు తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఎంజీఎం వైద్యులు ఎక్మోతో ఎస్పీ బాలుకి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై వివరాలను ఎప్పకటికప్పుడు తానే అందిస్తానని, ఏ విషయమైనా.. తన ద్వారానే తెలుస్తుందని సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. దయచేసి తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.













