గూఢచారి హీరోయిన్ కి చేదు అనుభవం
ఇటీవలి కాలంలో విడుదలై మంచి హిట్ కొట్టిన చిత్రం గూడఛారి. ఇందులో శోభితా ధూళిపాళ్ళ కథానాయికగా నటించింది. ప్రస్తుతం హిందీ సినిమాలో నటిస్తున్న ఈమెకి ఓ హోటల్లో చేదు అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం తాను నటిస్తున్న చిత్రంలో ముస్లిం పాత్ర పోషిస్తున్న శోభిత షూటింగ్ ముగించుకొని బుర్ఖాలోనే హోట్ రూంకి వెళ్ళిందట. అయితే తన పేరుపై రూం బుక్ అయిందని, తాళాలు ఇవ్వాలని రిసెప్షన్లో ఉన్న వ్యక్తిని అడిగింది శోభితా. ఆ సమయంలో ఆ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడట. బుర్ఖాలో ఉండడం వలన అతను నాకు తాళాలు ఇవ్వలేదు. అతనితో గొడవపడాలని లేకపోవడం వలన నేను ఏమనకుండా అక్కడి నుంచి వెళ్ళాను. నేను నటి అన్న విషయం ఆయనకు తెలియదు. అక్కడున్న వారు ఎవరు కూడా సాయం చేయలేదు. ముస్లిం అనుకొని ఆ వ్యక్తి నాతో ప్రవర్తించిన తీరు నన్ను ఎంతగానో బాధించింది. నటి అయిన నాకే ఇలాంటి పరిస్థితి వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుంది శోభితా.













