ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్
తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. గత మూడు రోజులుగా కాస్త అనారోగ్యంగా ఉండటంతో కరోనా పరీక్షలు చేయించామని, అయితే టెస్టుల్లో కోవిడ్19 పాజిటివ్‌గా తేలిందన్నారు. మెడిసిన్ ఇచ్చి హోం క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచించారని చెప్పారు. కుటుంబసభ్యలుకు ఇబ్బంది కలగకూడదని భావించి ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని ఏ ఆందోళన అక్కర్లేదని వీడియో ద్వారా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.













