మరోసారి యూవీలో శర్వానంద్
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ను అందుకుని చాలా రోజులైంది. మొన్న ఈ మధ్య వచ్చిన టైమ్ ట్రావెల్ మూవీ ఒకే ఒక్క జీవితం సినిమా మీద శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది.
అసలు విషయంలోకి వస్తే శర్వానంద్ ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో శర్వానంద్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని చూస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే శర్వా ఓ యంగ్ డైరెక్టర్ తో స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నాడని సమాచారం. లూజర్ వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్న అభిలాష్ రెడ్డి తో శర్వా ఓ మూవీ చేయాలని చూస్తున్నాడు.
1990 బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఫ్యామిలీ ఎమోషనల్ కథనాన్ని సరికొత్తగా ఈ సినిమాలో ప్రెజెంట్ చేయనున్నాడట అభిలాష్. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. ఇప్పటికే యూవీలో రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలు చేసిన శర్వా ఇప్పుడు మరో ప్రయోగాన్ని కూడా యూవీ బ్యానర్ లోనే చేయబోతున్నాడట. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి ఈ సినిమాను లాంఛ్ చేయాలని చూస్తున్నాడు డైరెక్టర్ అభిలాష్.













