రామ్‌చరణ్, శంకర్ కాంబోలో పాన్ ఇండియా మూవీ
రామ్‌చరణ్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి చిరంజీవి, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ హీరో రణ్‌వీర్‌సింగ్ అతిధులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్‌పై చిరంజీవి క్లాప్ కొట్టారు. శంకర్‌కు స్కిప్ట్ ను అందించారు. రణ్‌వీర్‌సింగ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా యూనిట్ విడుదల చేసిన మూవీ కాన్సెప్ట్ పోస్టర్లో చిత్రబృందం ఆహార్యం ఆకట్టుకుంది. అందరూ బ్లాక్ సూటు, నల్లకళ్లాద్దాలు ధరించి, చేతిలో ఫైలు, బ్యాగ్‌తో సీరియస్ మిషన్ కోసం ముందుకెళుతున్నట్టు కనిపించారు. వియ్ ఆర్ కమింగ్ అనే క్యాప్షన్ పెట్టారు. చరణ్‌కు హీరోగా ఇది 15వ చిత్రం. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్నారు.
అంజలి, సునీల్, నవీన్‌చంద్ర, శ్రీకాంత్, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఫై దిల్‌రాజు -శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్‌రాజుకు నిర్మాతగా ఇది 50వ చిత్రం. త్వరలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, కొరియోగ్రఫీ, జానీమాస్టర్, సినిమా టోగ్రాఫర్ : తిరుణ్ణావుక్కరుసు, గీత రచయితలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్.













