కొరటాల శివ సమర్పణలో సత్యదేవ్ కొత్త చిత్రం షురూ
సత్యదేవ్ హీరోగా అరుణాచల క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వి.వి.గోపాలకృష్ణ దర్శకుడు. సత్యదేవ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, హరీష్‌శంకర్ కెమెరా స్విఛాన్ చేసి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత మాట్లాడుడూ సత్వదేవ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రమిది. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందిస్తున్నాం. దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన శైలి హంగులన్నీ ఇందులో ఉంటాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, ఎడిటర్: నవీన్ నూలి.













