మైండ్ బ్లాక్.. అరుదైన రికార్డు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ సరిలేరు నీకెవ్వరు, 2020 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దేవిశ్రీ ఈ సినిమాకు మంచి ఆల్బమ్ అందించారు. ఈ సినిమాలోని ఓమాస్ సాంగ్ అరుదైన రికార్డు సాధించింది. మైండ్ బ్లాక్ సాంగ్ ఇటీవలే యూట్యూబ్ వేదికగా 100 మిలియన్ వ్యూస్ దక్కించుకున్న సాంగ్స్ క్లబ్లో చేరింది. ఈ పాటలో మహేష్ అదిరిపోయే డాన్సుతో పాటు హీరోయిన్ రష్మిక మండన్న అందాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.













