స్టార్ హీరోయిన్‌తో ట్రెండ్ సెట్టర్ చేయబోతున్న వెబ్ సిరీస్
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక కొత్త తరహా సినిమా వస్తుంది. దాంతో ట్రెండ్ మారిపోతుంది. ఇకపై అలాంటి సినిమాలను చేసేందుకు, తీసేందుకు హీరోలు, దర్శకనిర్మాతలు మొగ్గు చూపుతుంటారు. అలాంటి ట్రెండే 2017లో టాలీవుడ్లో క్రియేట్ అయ్యింది. అప్పటివరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసిన విజయ్ దేవరకొండ `అర్జున్‌రెడ్డి`తో అతనిలోని కొత్త నటుడు బయటికి వచ్చాడు. ఆ సినిమా చేసిన ఘనత, విజయ్ను ఓవర్‌నైట్ స్టార్నుచేసిన ఘనత దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకే దక్కుతుంది. హీరోతోపాటు సందీప్ కూడా ఓవర్‌నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. హీరోలందరూ అతని డైరెక్షన్లో సినిమా చెయ్యాలి అని ఎదురుచూసేంత పేరు తెచ్చుకున్నాడు. అయితే తన రెండో సినిమాగా అర్జున్‌రెడ్డి చిత్రాన్నే హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశాడు. షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది.
తమిళ్లో ఆదిత్యవర్మ పేరుతో రీమేక్ అయింది. గిరీశాయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో తమిళ్ హీరో విక్రమ్ కుమారుదు ధ్రువ్ విక్రమ్ టైటిల్ రోల్ పోషించాడు. ఇదిలా ఉంటే సందీప్‌రెడ్డి కోసం టాలీవుడ్ హీరోలు ఎంతో ఎదురుచూస్తూ ఉంటే అతను మాత్రం తన చూపును బాలీవుడ్ వైపు టర్న్ చేశాడు. బాలీవుడ్లో భారీ బడ్జెట్‌తో ఓ సినిమాను ప్లాన్ చేశాడు. అయితే అందులో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఏ బేనర్లో చేస్తున్నాడు అనే వివరాలను అఫీషియల్‌గా ఎనౌన్స్ చేద్దామనుకునే లోపే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో తన ప్రయత్నాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు.
ఇప్పట్లో సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదని అందరికీ తెలుసు. అయితే ఆగస్ట్, సెప్టెంబర్లలో థియేటర్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో కొంత ఆశాభావం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా అది సాధ్యమయ్యే విషయం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఓటీటీ ద్వారా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాదు కొంతమంది ప్రముఖ దర్శకనిర్మాతలు వెబ్‌సిరీస్‌ను రూపొందించేందుకు ఇష్టపడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సందీప్‌రెడ్డి కూడా ఒక వెబ్ సిరీస్‌ను ప్లాన్ చే్స్తున్నాడని తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌తో రూపొందే ఈ వెబ్ సిరీస్‌లో ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని సమాచారం. అయితే ఆ స్టార్ హీరోయిన్ ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని సమాచారం.













