సమంత ఇప్పుడు మరో టర్న్ ?
కథానాయికగా వెండితెరపై సమంత సూపర్ డూపర్ సక్సెస్. ఇటీవల బాక్సాఫీస్ వద్ద సమంత సాధించిన హిట్స్ ఆమె కెరీర్‌ను అమాంతం నెక్ట్స్ లెవెల్‌కి తీసుకు వెళ్లాయనడంలో సందేహం లేదు. వెండితెరపై అగ్రకథానాయికగా నిరూపించుకున్న సమంత ఇప్పుడు ఇంకో టర్న్ తీసుకున్నారని సమాచారం. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటాలను కుంటున్నారట. అందుకే ఓ వెబ్ సిరీస్‌కు సమంత సైన్ చేశారని టాక్. ఈ వెబ్ సిరిఈస్ తమిళం, హిందీ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుందట. ఆల్రెడీ చెన్నైలో షూటింగ్ కూడా ఆరంభం అయిందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 96 తెలుగు రీమేక్‌లో నటించడానికి ప్రిపెర్ అవుతున్నారు సమంత.













