మదురైలో సమంత సందడి
దక్షిణాది తార, అక్కినేనివారింటి కోడలు సమంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మదురైలో సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమం కోసం మదురైకి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆ ప్రాంగణం మొత్తం అభిమానులతో నిండిపోయింది. వారిని మరింత ఉత్సాహపరుస్తూ సమంత సెల్ఫీలు దిగడంతో అభిమానులు ఖుషీ అయిపోయారు. ఆ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమంత బదిలిస్తూ తనకు రాజకీయాలు పెద్దగా తెలీవని, రాజకీయాల్లోకి వచ్చే హీరోలని స్వాగతిస్తానని పేర్కొంటూ, వారికి ఆల్ది బెస్ట్ చెప్పింది. అలాగే సినీ పరిశ్రమలో క్యాస్టించ్ కౌచ్ ఆరోపణలపై స్పందిస్తూ, అన్ని రంగాల్లోనూ ఉన్నట్లే సినీ రంగంలోనూ బ్లాక్ షీప్లున్నాయని, వాటి వల్లే సినీ పరిశ్రమకు కళంకం ఏర్పడుతోందని వ్యాఖ్యానించింది. తన కెరీర్లో ఎప్పుడూ ఇటువంటిది ఎదురుకాలేదని, తనకు పేరు, ప్రఖ్యాతులు ఇచ్చిన సినీ పరిశ్రమని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడనని సమంత పేర్కొంది.













