వెంకీని పట్టించుకోని సల్మాన్
మరో నాలుగురోజుల్లో రిలీజ్ కాబోతున్న కిసీకా భాయ్ కిసీకా జాన్ మీద ఊహించని రీతిలో బజ్ లేదు కానీ రిలీజయ్యాక ఓ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందని సల్మాన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఓ పక్క అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనప్పటికీ, బుకింగ్స్ మాత్రం చాలా స్లోగా ఉన్నాయి. రంజాన్ అయ్యేవరకు ముస్లింలు ఎవరూ ఈ సినిమాల జోలికి వెళ్లరు. రీద్ అదే రోజు కాబట్టి, ఆరోజు సాయంత్రం నుంచి హౌస్ ఫుల్ బోర్డ్స్ ఉంటాయని నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
ఇదంతా బాలీవుడ్ మ్యాటర్. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా అసలు ప్రేక్షులకు తెలియడం లేదు. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కీ రోల్ చేసినా దాన్ని పబ్లిసిటీ చేసుకోవడంలో చిత్ర యూనిట్ ఫెయిల్ అయింది. వెంకటేష్ ను టార్గెట్ చేసి ప్రమోషన్స్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉండే దగ్గుబాటి ఫ్యాన్స్ వల్ల అయినా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సుంది. కానీ మేకర్స్ అదేం చేయట్లేదు.
మరోవైపు ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ చిన్న క్యామియో చేసిన సంగతి తెలిసిందే. తనని కూడా జస్ట్ అలా సాంగ్లో చూపించి వదిలేశారు. వీటన్నింటినీ వాడుకుంటే టాలీవుడ్ లో మంచి బజ్ వచ్చేది. ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయట్లేదు. పూజా ఒక్కటే ఎంతవరకు సినిమాను ప్రమోట్ చేస్తుంది? ఈ రెండు మూడు రోజుల్లో టాలీవుడ్ లో సల్మాన్, వెంకీ తో కలిపి ఓ ప్రెస్ మీట్ పెట్టినా మంచి హైప్ వచ్చే ఛాన్సుంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.













