కథ రెడీ అయినా సల్మాన్ ఖాన్ పూరి జగన్నాధ్ ల పాన్ ఇండియా మూవీ
విజయ దేవరకొండ హీరో గా ఫైటర్ స్క్రీన్ నేమ్ తో ఓ చిత్రాన్ని పూరి జగన్నాధ్ చేస్తున్న విషయం తెలిసిందే, అయితే… లాక్ డౌన్ కారణం గా షూటింగ్ ఆగిపోయింది ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినతరువాత బాలీవుడ్లో ఓ సినిమా చేయడానికి పూరి జగన్నాథ్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. గతం లో అమితాబ్ బచ్చన్ హేమమాలిని, ఛార్మి లతో బుడ్డా హోగా తేరా బాప్ చిత్రం తో బాలీవుడ్ లో ఎంటర్ అయ్యాడు. త్వరలోనే ఓ బాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్టు పూరి ఇటీవలే ప్రకటించాడు. అందులో ఓ అగ్ర కథానాయకుడు నటిస్తాడని హింట్ ఇచ్చాడు.
అయితే.. ఆ హీరో ఎవరన్న విషయంలో క్లారిటీ దాదాపుగా వచ్చేసింది. అతనే.. సల్మాన్ ఖాన్. అవును… పూరి దృష్టిలో ఉన్న హీరో సల్మాన్. తన కోసమే పూరి ఓ కథ రెడీ చేశాడని టాక్. పూరి సంచనలం `పోకిరి`ని సల్మాన్ హిందీలో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచీ పూరి – సల్మాన్ ఇద్దరూ టచ్‌లోనే ఉన్నారు. ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని ఇది వరకే అనుకున్నారు. కానీ.. కార్య రూపం దాల్చలేదు. అయితే ఈసారి మాత్రం ఆ ఛాన్స్ ని పూరి వదులుకోవాలనుకోవడం లేదు. త్వరలోనే ఈ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం ప్లానింగ్ లో వుంది.













