సల్మాన్ సరసన ఐశ్వర్య ?
సల్మాన్‌తో కొన్నాళ్లు సహజీవనం చేసిన ఐశ్వర్య..అతని ఆగడాలు తట్టుకోలేక, అతన్నుంచి విడిపోవడం తెలిసిందే. చాలా సందర్భాల్లో ఐస్‌పై సల్మాన్ చేయి కూడా చేసుకునేవాడని, పలు సందర్భాల్లో ఆమెకు గాయాలు కూడా అవుతుండేవని ఇప్పటికీ చెప్పుకుంటారు. అందుకే సల్మాన్ తన జోలికి రాకుండా ఉండేందుకుగాను.. అమితాబ్‌కి కోడలయిన ఐస్.. ఆ తరువాత నుంచి సల్మాన్‌కి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం సల్మాన్-ఐశ్వర్య జంటగా ఓ సినిమా రూపొందించేందుకు ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని చెప్పాల్సిన అవసరమేముంది? భన్సాలీ దర్శకత్వంలో ఇంతకుముందు సల్మాన్-ఐశ్వర్య హమ్ దిల్ దే చుకే సనమ్‌లో నటించారు.













