కెరీర్లో బిజీయెస్ట్ ఫేజ్ లో సాయి పల్లవి
సాయి పల్లవి(sai pallavi) కెరీర్లో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ఫేజ్ మొదలుకాబోతోంది. కొంతకాలంగా సౌత్ సినిమాల్లో పెద్దగా కనిపించని ఈ నటి.. ఇక వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ఆమె నటించిన మూడు ప్రిస్టిజీయిస్ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. నవంబర్‌లో రామాయణ(ramayana), ఆ తర్వాత ఓం(OM), 2027 జనవరిలో మణిరత్నం(Mani ratnam) తెరకెక్కిస్తున్న ఇంజి వెల్లం(Inji vellam) ఆడియన్స్ ముందుకు రానున్నాయి. దీంతో ఈ మూడు నెలలు సాయి పల్లవి కెరీర్లో అత్యంత బిజీగా మారనున్నాయి.
ఇక సాయి పల్లవి కెరీర్‌ను గమనిస్తే గ్లామర్ కంటే యాక్టింగ్ కు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలనే ఆమె ఎంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో రామాయణలో సీత పాత్ర దక్కడం ఆమె కెరీర్‌కు మరో స్పెషల్ మైల్‌స్టోన్‌గా మారనుంది. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ పౌరాణిక సినిమా దేశీయ ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటివరకు తన యాక్టింగ్ తో సంపాదించుకున్న గుర్తింపును మరింత విస్తరించుకునే అవకాశం సాయి పల్లవికి లభించనుంది.
ఇవి కూడా చదవండి
రామాయణ తర్వాత ఓంలో ధనుష్(dhanush), మమ్ముట్టి(mamootty), శ్రీలీల(sree leela) వంటి నటులతో కలిసి కనిపించనున్న సాయి పల్లవి.. ఆ వెంటనే మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి(vijay sethupathi) సరసన ఇంజి వెల్లంతో ప్రేక్షకులను పలకరించనుంది. పౌరాణిక పాత్ర నుంచి తమిళ నేపథ్యంలోని విభిన్న కథ వరకు ఇలా వరుసగా భిన్నమైన సినిమాలు రావడం ఆమె కెరీర్లో ప్రత్యేకతగా మారింది. అందుకే రాబోయే మూడు నెలలు సాయి పల్లవి సినిమాల పరంగానే కాకుండా, ఆమె ఇమేజ్ను మరింత విస్తరించే కీలక దశగా మారే అవకాశముంది.








