సాయి పల్లవికి జక్కన్న పిలుపు?
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ కోసం ఇప్పటికే పలువురు తారల్ని ఎంపిక చేశారు. దక్షిణాదితో పాటు బాలీవుడ్ తారలు కూడా కీలక పాత్రలు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాళ్లతో పాటు మరికొద్దిమంది ఈ చిత్రంలో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకోసం చిత్రబృందం పలువరు నటీనటులతో సంప్రదింపులు జరుపుతోందని, ప్రముఖ కథానాయిక సాయిపల్లవి కూడా రాజమౌళి నుంచి పిలుపు అందుకున్న వారిలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. మరి ఆమెకి కథానాయికగా ఎంపిక చేయబోతున్నారా లేక కీలక పాత్ర కోసమా అనేది తెలియాల్సి ఉంది. రామ్చరణ్ సరసన ఆలియాభట్ కథానాయికగా నటించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కోసం బ్రిటిష్ భామ డైసీని ఎంపిక చేసినా, ఆమె కొన్ని కారణాలతో ఆరంభంలోనే తప్పుకొంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడం కోసం రాజమౌళి బృందం ఎప్పట్నుంచో కసరత్తులు చేస్తోంది.













