సత్యదేవ్ సినిమాకు రూ.20 కోట్ల బెట్టింగ్
సినిమా ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్(Satyadev). కథ, పాత్ర విషయంలో ప్రయోగాలకు వెనుకాడని ఆయనకు నటుడిగా మంచి ప్రశంసలు దక్కుతున్నా.. కమర్షియల్ సక్సెస్ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇటీవల వచ్చిన రావు బహదూర్(rao bahudur) కూడా సత్యదేవ్ యాక్టింగ్ కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు సమవర్తి(samavarthi)తో మరోసారి తన లక్ ను టెస్ట్ చేసుకుంటున్నారు. అడవుల నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా టీజర్ ఇప్పటికే ఆడియన్స్ ముందుకు వచ్చి ఆసక్తిని పెంచుతోంది.
అయితే సమవర్తి విషయంలో అసలు డిస్కషన్ సినిమా బిజినెస్ చుట్టూనే మొదలైంది. ఈ సినిమా నిర్మాణానికి ఇప్పటివరకు సుమారు రూ.18 కోట్లు ఖర్చయినట్టు సమాచారం. ప్రమోషన్స్, వడ్డీలను కలిపితే మొత్తం వ్యయం దాదాపు రూ.20 కోట్లకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. సత్యదేవ్ మార్కెట్‌ను లెక్కలోకి తీసుకుంటే ఇది నిర్మాతలకు చిన్న మొత్తం కాదు. గతంలో రావు బహదూర్ కోసం కూడా దాదాపు రూ.18 కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ, ఆ స్థాయి పెట్టుబడి పూర్తిగా వెనక్కి రాలేదు.
ప్రస్తుతం సమవర్తి ఓటీటీ బిజినెస్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ తో డిజిటల్ బిజినెస్‌కు మార్గం సుగమమవుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా కనీసం రూ.10–12 కోట్లు వస్తే థియేట్రికల్ రికవరీ భారం కొంత తగ్గుతుంది. దీంతో సత్యదేవ్‌కు ఈ సినిమా కేవలం మరో మూవీ కాకుండా.. ఆయన కెరీర్లో కమర్షియల్ లెక్కలు మార్చే కీలక అవకాశంగా మారింది.








