తెలుగులో మంచి పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది – బాలీవుడ్ నటి హేమ శర్మ
బాలీవుడ్ లో యమ్లా పగ్లా దీవాన ఫిర్ సే, వన్ డే జస్టిస్ డెలివెరడ్, దబాంగ్ 3 వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ శర్మ. ఆమె సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 18 రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని ఆడియెన్స్ కు మరింత చేరువైంది. సోషల్ మీడియాలో వైరల్ బాబీగా ఫేమ్ అయిన హేమ శర్మ..భోజ్ పూరి లో చేసిన సాంగ్స్ ఛాట్ బస్టర్స్ అయి రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించాయి. ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఇప్పుడు తెలుగులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. హేమ శర్మ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో మీడియాతో స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
– మాది ఢిల్లీకి దగ్గరలోని ఘజియాబాద్. సినిమాలకు ఏమాత్రం సంబంధం లేని ఫ్యామిలీ. నేను కంప్లీట్ ఔట్ సైడర్ ను. సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం. కొరియోగ్రాఫర్ గా మారాలనే ఆసక్తి ఉండేది. అయితే డెస్టినీ నన్ను స్క్రీన్ ముందుకు నటిగా తీసుకొచ్చింది. నా లైఫ్ స్టైల్, ఫ్యాషన్, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైరల్ బాబీగా నాకు పేరు తీసుకొచ్చాయి. ఆ పాపురాలిటీతో బాలీవుడ్ లో అవకాశాలు దక్కాయి.
– ధర్మేంద్ర, బాబీ డియోల్, సన్నీ డియోల్, కృతి ఖర్బందా ప్రధాన పాత్రల్లో నటించిన యమ్లా పగ్లా దీవాన ఫిర్ సే సినిమాలో నాకు ఓ మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రంలో నేను డా.సుభి క్యారెక్టర్ చేశాను. ఈ పాత్రకు మంచి గుర్తింపు రావడంతో బాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత అనుపమ్ ఖేర్, ఇషా గుప్తా నటించిన వన్ డే జస్టిస్ డెలివర్డ్ చిత్రంలో ఆఫర్ దక్కింది. ఈ సినిమాలో స్పెషల్ అప్పీయరెన్స్ గా కనిపించాను. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లో నటించాను. ఇలా బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా నా జర్నీ సాగుతున్న టైమ్ లో కోవిడ్ వచ్చింది. లాక్ డౌన్ వల్ల అందరితో పాటే నా మూవీస్ కూడా కొన్ని సెట్స్ మీదకు వెళ్లలేదు. భోజ్ పూరిలో స్టార్ గా ఉన్న పవన్ సింగ్ తో కలిసి ఓ పాట చేశాను. ఈ పాట చిత్రీకరణ సమయంలో భోజ్ పూరి సాహిత్యం నేర్చుకుని పాటలో పర్ ఫార్మ్ చేశాను.
– నేను తెలుగు సినిమాలను ఇష్టపడతాను. తెలుగు చిత్రాల్లోనే క్రియేటివిటీ నన్ను ఆకట్టుకుంటుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలుక మంచి పేరుంది. అన్ని భాషల్లో డబ్ అవుతుంటాయి. నేరుగా రిలీజ్ అవుతున్నాయి. హిందీ ప్రేక్షకులకు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నా. ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ గారి సినిమాకు ఆడిషన్ జరిగింది. నా ఫేస్ సాఫ్ట్ లుక్ లో ఉండటం వల్ల సెలెక్ట్ కాలేదు. కానీ అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా తమ సినిమాకు పిలుస్తామని త్రివిక్రమ్ టీమ్ వాళ్లు చెప్పారు. నేను త్రివిక్రమ్ గారిని కలవలేదు. కానీ ఆయన సినిమాలంటే ఇష్టం.
– తెలుగులో మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, ప్రభాస్..ఇలా అందరి హీరోల సినిమాల్లో నటించాలని ఉంది. హీరోయిన్స్ లో ప్రతి ఒక్కరూ ఇష్టమే. తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ చాలా బాగుంటాయి. ట్రెడిషనల్ వేర్ లో తెలుగు హీరోయిన్స్ చాలా అందంగా ఉంటారు. నాకు గ్లామర్ రోల్స్ కంటే పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. కంటెంట్ బాగున్న హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ప్రేక్షకులు కేవలం కంటెంట్ నే ఆదరిస్తున్నారు.
– సినిమా కంటే ఓటీటీ కంటెంట్ ఎక్కువ ప్రేక్షకాదరణ పొందడం చూస్తున్నాం. వెబ్ సిరీస్, ఓటీటీ షోస్ చేయడానికి ఆసక్తిగా ఉన్నాను. ఇతర భాషల్ని త్వరగా నేర్చుకుంటా. భోజ్ పూరి నేర్చుకుని సాంగ్స్ చేశాను. అలాగే తెలుగులోనూ నటించగలనే నమ్మకం ఉంది. వదిన, అమ్మ, సోదరి…ఇలా ఏ పాత్రలో అయినా నటించేందుకు సిద్ధంగా ఉన్నాను. కొన్ని తెలుగు మూవీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆ వివరాలు వెల్లడిస్తాను.








