ఆర్ఆర్ఆర్ మూవీ ప్రెస్‌మీట్
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రానికి సంబంధించి అభిమానులలో ఎన్నో అనుమానాలు నెలకొని ఉండగా, వాటికి తాజాగా క్లారిటీ ఇచ్చాడు జక్కన్న. ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చిత్రానికి సంబంధించిన ముఖ్య విషయాలు వెల్లడించాడు రాజమౌళి. అందరి కోరిక మేరకు చిత్రానికి ఆర్ఆర్ఆర్ అనే టైటిల్‌నే పెట్టాలని అనుకున్నాం.
ఇక ఈ చిత్ర కథ 1920లో ఉత్తర భారతదేశంలో జరిగే కథగా తెరకెక్కించనున్నాను. ఇందులో యంగ్ వర్షెన్ అల్లూరి సీతారామ రాజుగా చరణ్, యంగ్ వర్షన్ కొమరం భీంగా ఎన్టీఆర్ నటించనున్నాడు. స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు ఒకే సమయంలో కలిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది అన్న ఫిక్షనల్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా వెల్లడించారు రాజమౌళి. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాం. అందుకే సినిమా మొదలు పెట్టడానికి చాలా సమయం పట్టింది. సినిమాను 2020 జులై 30 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం.













