బాహుబలి2 ని అధిగమించిన ఆర్ఆర్ఆర్ : నార్త్ ఇండియా లో 5 రోజుల కలెక్షన్ 107Cr
ఆర్ఆర్ఆర్ సినిమా బాలీవుడ్లో బాహుబలి 2 సినిమా రికార్డును బ్రేక్ చేసేసింది. వంద కోట్ల రూపాయల మైలు రాయిని దాటేసింది. ఇప్పుడు ఈ చిత్రం రెండు వందల కోట్ల దిశగా అడుగులు వేస్తుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి తర్వాత ఈ దర్శక దిగ్గజం తెరకెక్కించిన చిత్రం RRR. టాలీవుడ్ అగ్ర కథానాయకులు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం మార్చి 25న పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజైంది. హై ఎక్స్పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ చిత్రం అంచనాలకు ధీటుగా రాణిస్తోంది. వరల్డ్ వైడ్‌గా వసూళ్లను కొల్లగొడుతూ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన గత చిత్రం బాహుబలి రికార్డులను తిరగ రాస్తుంది. లేటెస్ట్గా ఆర్ఆర్ఆర్ బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తుడిచి పెట్టేస్తోంది.
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ మూవీ బాలీవుడ్లో వంద కోట్ల రూపాయల వసూళ్లను క్రాస్ చేసేసింది. వంద కోట్ల రూపాయల మార్కును టచ్ చేయడానికి బాహుబలి సినిమా వారం రోజుల సమయాన్ని తీసుకుంటే, ఆర్ఆర్ఆర్ ఐదు రోజుల్లోనే ఈ మైల్‌స్టోన్‌ను దాటేయడం విశేషం. శుక్రవారం రూ.20.07 కోట్లు.. శనివారం రూ.24 కోట్లు.. ఆదివారం రూ.31.50 కోట్లు.. సోమవారం రూ.17 కోట్లు, మంగళవారం రూ.15.02కోట్లు వచ్చాయి.. అంటే ఐదు రోజుల్లో మొత్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు రూ.107.59 కోట్లు వచ్చాయి. ఈ సినిమా ఇప్పుడు రెండు వందల కోట్లను సాధించే దిశగా అడుగులు వేస్తుంది.గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. చరిత్రలో ఎన్నడూ కలుసుకోని ఇద్దరు యోధులు కలిసి స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందించారు. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్ నటించారు. అలాగే రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా నటించారు. ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో సినిమాను రూపొందించారు.
https://twitter.com/PenMovies/













