RGV నేకిడ్, నంగే, నగ్నంతో మరో సారి బిజినెస్ ట్రిక్
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అని మరోసారి నీరూపించాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా వైవిధ్యమైన బోల్డ్ సినిమాలను వదులుతూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. మొన్న మియా మాల్కోవాతో క్లైమాక్స్ సినిమా చేసిన ఆర్జీవి అనంతరం నగ్నం అనే మరో కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. సినిమా రేటుతో పాటు అందులో బోల్డ్ గా నటిస్తున్న నటి వివరాలను కూడా బయటపెట్టాడు. RGV వరల్డ్ అనే ఒక సపరేట్ యాప్ వరల్డ్ క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఇక నుంచి తనకు నచ్చిన సినిమాలను అందులోనే రిలీజ్ చేస్తానని అన్నాడు. ఇక నెక్స్ట్ NNN అనే ఓటీటీ సినిమాతో రానున్న వర్మ ఈ సారి కూడా మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాడు. మునుపెన్నడు లేని విధంగా ఒక హాట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశాడు.
నేకిడ్, నంగే, నగ్నం అంటూ ఇంగ్లీష్, హిందీ, తెలుగులో రిలీజ్ కానున్న ఈ NNN థ్రిల్లర్ కాన్సెప్ట్ లో నటిస్తున్న నటి గురించి కూడా వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఆమె పేరు స్వీటీ అంటూ న్యాచురల్ బార్న్ యాక్టర్స్ అని కొన్ని ఫొటోలు వదిలాడు. రెడ్ సారీలో హాట్ గా స్టిల్స్ ఇచ్చిన ఫోటోలను రిలీజ్ చేసిన వర్మ ఆమె సోషల్ మీడియా ఎకౌంట్స్ ని కూడా షేర్ చేశాడు. చూస్తుంటే ఈ కొత్త నటిని వర్మ బాగా ప్రమోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక NNN సినిమాను జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు వర్మ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాడు. 27న రాత్రి 9గంటలకు ఆర్జీవి వరల్డ్ లోనే కాకుండా యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేయనున్నట్లు వివరణ ఇచ్చాడు. ఇక రెండవ ట్రైలర్ కూడా వైరల్ అవుతోంది. ఇకపోతే వర్మ ఈ సారి తన రేటును పెంచేశాడు.
NNN ఒక వ్యూ కోసం 200 రూపాయలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. క్లైమాక్స్ సినిమా కోసం కేవలం 100రూపాయలు ఫిక్స్ చేసిన వర్మ ఈ సారి స్వీటీ కోసం రేటును డబుల్ చేయడం వైరల్ గా మారింది. అంతే కాకుండా హీరోయిన్ స్వీటీ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు. మరి ఈ అడల్ట్ థ్రిల్లర్ తో వర్మ ఎంతవరకు అడ్డంగా ఎంత సంపాదిస్తాడో వేచి చూడాల్సిందే మరి.













