ఆర్.జి.వి పాచిక పారింది…. క్లైమాక్స్ కు 24 గంటల్లో 3 కోట్ల కలెక్షన్
కరోనా లాక్డౌన్ సమయంలో థియేటర్లు మూతపడిన నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసిన డిజిటల్ ప్రయోగం ఆర్థికంగా సత్పలితాలను ఇస్తున్నది. ఇటీవల శ్రేయాస్ మీడియా యాప్‌లో ఆర్జీవి వరల్డ్ థియేటర్లో మియా మాల్కోవా నటించిన శృంగార భరిత చిత్రం ప్రేక్షకులను, సినీ అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే కలెక్షన్లపరంగా తొలి రోజు దుమ్మురేపినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే..24 గంటల్లో 3 కోట్ల కలెక్షన్ దర్శకుడు రాంగోపాల్ వర్మ శివ సినిమా నుంచి సంచలన ప్రయోగాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం తెలిసిందే. సినిమా మేకింగ్‌లో సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెబుతూ కొత్త తరహా విధానాల్లో సినిమాలు తీస్తూ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఆయనకు కొత్తేమీ కాదు. తక్కువ బడ్జెట్, మామూలు కెమెరాతో ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక లాక్డౌన్లో అమెరికాకు చెందిన శృంగార తార మియా మాల్కోవాతో రూపొందించిన క్లైమాక్స్ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీ యాప్‌లోని ఆర్జీవి థియేటర్లో శనివారం రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గత 24 గంటల్లో ఊహించని విధంగా వసూళ్లు రాబట్టడం సినీ పరిశ్రమలో గేమ్ ఛేంజర్ అనే వర్మ ట్వీట్ చేశారు.
శనివారం ఓటీటీలో రిలీజ్ చేసిన క్లైమాక్స్ చిత్రానికి రూ.100 టికెట్ ధరను నిర్ణయించారు. జీఎస్టీ ఇతర చార్జీలతోపాటు మొత్త కలిపి సుమారు రూ130 వరకు ధరగా నిర్ణయించారు. ఈ సినిమాకు తొలి 12 గంటల్లో 1,68,596 మంది చూశారు. ప్రేక్షకుల రియాక్షన్‌కు యాప్ కూడా క్రాష్ అయింది అంటూ వర్మ ట్వీట్ చేశారు. అయితే క్లైమాక్స్ సినిమా రిలీజ్‌కు ముందు వర్మ తన మూవీకి ఓపెనింగ్ డే రోజున రూ.50 లక్షలు వస్తాయని అంచనా వేశారు. కానీ 12 గంట్లలోనే 1.68 లక్షల మంది చూడటంతో అంతకంటే భారీగా వసూళ్లు నమోదయ్యాయి. తొలి 12 గంటల్లోనే రూ.1.6 కోట్లు వసూలు చేయడం విశేషంగా భావించాల్సిందే. ఇలాంటి కలెక్షన్లు సినిమా నిర్మాతలకు మంచి ఉత్సాహాన్ని ఇచ్చే అంశాలుగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 24 గంటల్లో 3 కోట్ల రూపాయలు క్లైమాక్స్ చిత్రం శ్రేయాస్ మీడియా యాప్‌లో భారీగా వసూళ్లను సాధించినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రం 24 గంటల్లోనే సుమారు 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే వర్మ ఇంకా తుది వసూళ్లను ప్రకటించకపోవడంతో కచ్చితంగా తొలి రోజు కలెక్షన్ ఎంతన్నది తెలియాల్సి వుంది.













