డైరెక్టర్ గా ఎంట్రీ ఇస్తున్న కీర్తి సురేష్ అక్క
టాలీవుడ్ లో హీరోల అక్కలు డైరెక్టర్స్ అవడం చూశాం. మహేష్ బాబు అక్క మంజుల మనసుకు నచ్చింది అనే సినిమాతో దర్శకురాలి అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. రీసెంట్గా నాని వాళ్ల అక్క గంటా దీప్తి కూడా మీట్ క్యూట్ అనే వెబ్ ఫిల్మ్ తో డైరెక్టర్ గా మారింది. కానీ వీరిద్దరూ డైరెక్టర్ గా తమదైన ముద్ర వేసుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయారు.
అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ సోదరి డైరెక్టర్ అవబోతుంది. తనే రేవతి సురేష్. కీర్తి సురేష్ సోదరినే ఈ రేవతి సురేష్. ఇప్పటివరకు అసలు తనెవరో కూడా తెలియని రేవతి ఇప్పుడు డైరెక్టర్ కాబోతుండటం విశేషమే. కాకపోతే ఆమె డైరెక్ట్ చేస్తోంది ఫీచర్ ఫిల్మ్ కాదట. ఓ షార్ట్ ఫిల్మ్ అట. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు థాంక్ యు.
తన సోదరి డైరెక్టర్ చేస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ ను కీర్తి తన ఇన్ స్టా లో స్టోరీ గా షేర్ చేసింది. థాంక్ యు అనే టైటిల్ లో యు బదులు కాఫీ కప్ ను చూపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే బాగా ఇంట్రెస్టింగ్నే ఉంది. కీర్తి ఈ పోస్ట్ గురించి ఈ స్వీట్ షార్ట్ ఫిల్మ్ థాంక్ యు తో నా సోదరి డైరెక్టర్ గా అరంగేట్రం చేయడం నాకెంతో సంతోషాన్నిస్తుంది. రేవతి, నీకు హగ్స్, లవ్.. అంటూ కామెంట్ చేసింది. మరి త్వరలోనే రేవతి కీర్తితో ఫీచర్ ఫిల్మ్ కూడా తీస్తుందేమో చూడాలి.













