మందు బాబులపై ఫైర్ అయిన రష్మీ
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన రష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు సామాజిక స్పృహ ఉంది. సమాజంలో జరిగే అన్యాయాలు, మూగజీవాల పట్ల జరుగుతున్న ఘోరాలపై ఆమె స్పందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో నెటిజెన్లపై సీరియస్ అవ్వడం, వారితో వాగ్వాదానికి దిగడం మనం చూస్తుంటాం. తాజాగా రష్మీ మందుబాబులపై ఫైర్ అయ్యింది. 40 రోజులుగా మద్యం విక్రయాన్ని ఆపేసిన ప్రభుత్వాలు ఒక్కసారిగా మద్యం షాపులకు అనుమతి ఇవ్వడంతో మందుబాబులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. దీనిపై రష్మీ స్పందిస్తూ ‘‘మద్యం కోసం షాపుల దగ్గర క్యూ కట్టేవారిపై స్టాంప్ వేయాలి. వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకుండా చూడాలి. అయితే అవసరం ఉన్నవారు మాత్రం మందు షాపుల వద్ద లైన్లో నిలబడొచ్చు. కనీస అవసరాలకు డబ్బులేని వీళ్ళకు మందుకు మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది.. ఇలాంటివన్నీ చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది. వీరు పేదవారా?’’ అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది.
దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ‘‘వీటి గురించి ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరు ఒక్కరికి కూడా విరాళం ఇవ్వలేదు’’ అంటూ ఫైర్ అయ్యాడు. నెటిజన్ ట్వీట్‌కు రష్మీ స్పందిస్తూ ‘‘ప్రస్తుతం నాకు షూటింగ్స్ లేకపోయినా నా దగ్గర డబ్బు ఉంది. నేను విరాళం ఇచ్చాను. వివిధ మార్గాల ద్వారా ఫండ్ సేకరించాను. మీరు మీ పని చేసుకోండి’ అంటూ ట్వీట్ చేసిన రష్మీ ‘‘ప్రజంతా వారింట్లో పని చేసే మనుషులు కోసం ఎదురుచూస్తున్నారు. వయోవృద్దులకు పని మనుషులు అవసరమే. కానీ, అన్నీ సక్రమంగా ఉన్నవారు తమ ఇంటి పనులు ఇంకొన్ని వారాలు చేసుకోలేరా?’’ అని ప్రశ్నించింది.













