పవన్ ఫ్యాన్స్ పై రేణూ ఫైర్..
ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ ను అభిమానులకు చేరవేస్తూ, ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది రేణు దేశాయ్. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసింది రేణూ. తన కూతురు ఆద్యతో కలిసి ఇన్ట స్టా లైవ్ లోకి వచ్చిన రేణూ పలు విషయాల గురించి చర్చించింది.
తన కెరీర్ మరియు పిల్లలకు సంబంధించిన విషయాలను తన కూతురితో కలిసి సమాధానాలిచ్చింది. దీనితో పాటూ కరోనా సెకండ్ వేవ్ తో జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించింది. అయితే ఇప్పుడు ఈ లైవ్ చాట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చలకే దారి తీసింది. ఒక ఫ్యాన్ అకీరా గురించి అడిగితే, తనకు సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కానీ అన్నీ ప్రైవేట్ గానే ఉంటాయి. ఫ్రెండ్స్ మాత్రమే వాటిని ఫాలో అయ్యే ఛాన్సుంది. అకీరాకు తన అకౌంట్స్ పబ్లిక్ చేయడం ఇష్టముండదు. ప్రైవేట్ లైఫ్ నే కావాలనుకుంటున్నాడంటూ రేణూ చెప్పుకొచ్చింది.
సరిగ్గా అదే టైమ్ కు మరో ఫ్యాన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడమని అడగ్గానే, రేణూ చిత్రంగా ప్రవర్తించి, ఆయన గురించి ఏ మాట్లాడాలి? నా లైవ్ కు వచ్చి మీరు ఆయన గురించి మెసేజ్ లు పెడుతున్నారు బానే ఉంది. సరే అని నేను తన గురించి మాట్లాడితే రేణూ కి ఇంకేం పన్లేదని మీరే అంటారు. మీరు అడిగారని మాట్లాడతా తప్పించి, నాకు వేరే పని లేక కాదని రేణూ ఆ ఫ్యాన్ కు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.













