‘నేనే నా’ లో రెజీనా ఫస్ట్ లుక్
రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం నేనే నా? నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రెజీనా ఫస్ట్ లుక్‌ను హీరో వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ వర్మ మాట్లాడుతూ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. కార్తీక్ రాజుగారు బాగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో రెజీనా ఆర్కియాలజిస్ట్‌గా కనపడతారు. నటిగా ఆమెను మరో యాంగిల్లో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. ఈ సినిమా కోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకుని యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నారు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:సామ్ సి.ఎస్, కెమెరా: పీకే వర్మ.













