చరణ్ సినిమాను సేతుపతి ఎందుకు చేయనన్నాడంటే
గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్, బుచ్చిబాబు సానతో తన 16వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే డైరెక్టర్ బుచ్చిబాబు మొదటి సినిమా ఉప్పెనలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆయన ఆ పాత్రను చేయడం వల్లే ఉప్పెన అంత బాగా ఆడిందని చాలా మంది అంటూ ఉంటారు.
అందుకే బుచ్చిబాబు మరోసారి సేతుపతితో కలిసి వర్క్ చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సినిమాలో సేతుపతికి ఓ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ను ఆఫర్ చేయగా, ఆ పాత్రను ఎంత పారితోషికమిచ్చినా చేయలేనని సేతుపతి సున్నితంగా తిరస్కరించాడని వార్తలొచ్చాయి. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సేతుపతి క్లారిటీ ఇచ్చాడు.
నాకు బుచ్చిబాబు కథ చెప్పిన మాట నిజమని, కచ్ఛితంగా ఆ కథ ప్రతి ఒక్కరూ సర్ప్రైజ్ అయ్యేలా ఉంటుందని చెప్పాడు. అయితే సినిమాలో నటించాలని అడిగినప్పుడు చరణ్‌కు తండ్రి క్యారెక్టర్ లో అయితే చేయలేనని తేల్చి చెప్పానని ఆయన వెల్లడించాడు. ప్రస్తుతం సేతుపతి క్రేజ్ బాగా నడుస్తుంది. ఇలాంటి టైమ్ లో హీరోలకు తండ్రి పాత్రలు చేయడం వల్ల కెరీర్లో చాలా నష్టపోవాల్సి వస్తుందని అందుకే ఆయన ఈ డెసిషన్ తీసుకున్నాడని కోలీవుడ్ వర్గాలంటున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న బుచ్చిబాబు-చరణ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.













