వచ్చే సంక్రాంతికి #RC15?
ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ చరణ్, ఆ తర్వాత వెంటనే తన తండ్రి మెగాస్టార్‌తో కలిసి చేసిన ఆచార్యతో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆచార్య తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా తమిళ డైరెక్టర్ శంకర్‌తో. చరణ్ కెరీర్లో 15వ సినిమాగా ఇది తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
2023లో శంకర్‌తో అయిన బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు రామ్ చరణ్. కానీ ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ చాలా లేట్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఈ సంక్రాంతికి రావాల్సింది కానీ మధ్యలో అనుకోకుండా శంకర్ ఇండియన్2 సినిమా రీస్టార్ట్ చేయాల్సి రావడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఇండియన్2 సినిమా 2023 జూన్‌లో రానుంది. అయితే దిల్ రాజు మాత్రం ఇప్పటికే రామ్ చరణ్ సినిమాను 2023లో రిలీజ్ చేస్తానని మాటిచ్చాడు. కానీ ఇప్పుడు ఇండియన్2 షెడ్యూల్‌ను బట్టి చరణ్ మూవీ పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ లేదంటే నవంబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు దిల్ రాజు.
ఒకవేళ అది కుదరకపోతే డిసెంబర్లో క్రిస్మస్ను టార్గెట్ చేయడానికి అవకాశముంది. అప్పుడు కూడా లేటయితే ఇక వచ్చే ఏడాది సంక్రాంతిని క్యాష్ చేసుకోవడానికి ఛాన్సుంది. లేటయినా సరే సినిమాను మంచి సీజన్ చూసి, హాలిడేస్‌లోనే రిలీజ్ చేయాలని దిల్ రాజు యోచిస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అలా చూసుకుంటే దిల్ రాజు ముందున్న బెస్ట్ ఆప్షన్ 2024 సంక్రాంతినే. ఇదిలా ఉంటే మార్చి 27న రానున్న చరణ్ బర్త్‌డే కి ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ టీజర్‌ను రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.













