రవితేజకు కూతురు తెచ్చిన లక్
సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల్లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అబ్బాయిల సంఖ్య ఎక్కువే. అయితే అదే ఫ్యామిలీలకు చెందిన అమ్మాయిలు మాత్రం యాక్టింగ్ కు దూరంగా ఉంటూనే సినీ రంగంలో తమకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకునే ట్రెండ్ ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఈ కొత్త తరహా జర్నీలో మాస్ రాజా రవితేజ(raviteja) కూతురు మోక్షద(Mokshadha) పేరు కూడా వినిపిస్తోంది. తండ్రి సినిమాల్లో హీరోయిన్గా కనిపించకుండా, తెరవెనుక బాధ్యతలు చేపడుతూ ఇండస్ట్రీలో తన ప్రయాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
రవితేజ తాజా సినిమా ఇరుముడి ఇరుముడి(Irumudi) విషయంలో మోక్షద పాత్ర ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడంతో పాటు ప్రాజెక్ట్ ప్రారంభ దశ నుంచే కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ముఖ్యంగా రవితేజకు ఈ కథపై ఆసక్తి కలిగించడంలో, ప్రాజెక్ట్ ముందుకు వెళ్లేలా చేయడంలో ఆమె సూచనలు ఉపయోగపడ్డాయని తెలుస్తోంది. అంతేకాదు, ఫ్యూచర్ లో రవితేజ ఎంచుకునే సినిమాల విషయంలోనూ ఆమె తన అభిప్రాయాలను పంచుకుంటున్నట్లు టాక్.
ఇప్పటివరకు పెద్దగా పబ్లిక్‌లో కనిపించని మోక్షద.. ఇరుముడి రిలీజ్ రోజు మహాధన్ తో కలిసి థియేటర్‌కు రావడం కూడా ఆసక్తిని పెంచింది. మహాధన్(Mahadhan) ఇప్పటికే యాక్టర్‌గా పరిచయమై, ప్రస్తుతం దర్శకత్వ విభాగంలో పనిచేస్తున్నాడు. మరోవైపు ఇరుముడికి వస్తున్న రెస్పాన్స్‌తో మోక్షదకు తన తొలి సినిమా అసోసియేషన్ మంచి గుర్తింపును తెచ్చిపెడుతోంది. ఇకపై ఆమె రవితేజ ప్రాజెక్టుల్లో మరింత కీలకంగా మారుతుందా? ఫ్యూచర్లో నిర్మాతగా మారి తండ్రి సినిమాలను నిర్మిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.








