రథేరా ట్రైలర్‌ను ఆవిష్కరించిన వినాయక్
పూల సిద్ధేశ్వరరావు హీరోగా నటిస్తున్న చిత్రం రథేరా. జూకెట్ రమేష్ దర్శకుడు. పూల సిద్ధేశ్వరరావు, నరేష్ యాదవ్, వై.ఎస్. కృష్ణమూర్తి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. అంతా కొత్తవారితో దర్శకుడు చిత్రాన్ని అద్భుతంగా తెరెక్కించినట్లుగా కనిపిస్తోంది. టైటిల్ ఆసక్తికరంగా ఉంది. హీరోకిది తొలి చిత్రమైనా అనుభవం వున్న వాడిలా నటించాడు అన్నారు. ఖోఖో క్రీడ నేపథ్యంలో సాగే చిత్రమిదని దర్శకుడు తెలిపారు.













