కార్తి కొత్త చిత్రం ప్రారంభం
కార్తి కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రానికి శ్రీకారం చుట్టింది. రష్మిక కథానాయిక. భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఎస్.ఆర్. ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మాతలు. ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. కార్తితో మేం నిర్మిస్తున్న రెండో చిత్రమిది. సూర్యతో ఎన్.జి.కె. మా సంస్థలోనే తెరకెక్కుతోంది. రెమో చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించిన భాగ్యరాజ్.. ఈసారి మరో విభిన్నమైన కథాంశంతో మెప్పించనున్నాడు. కార్తి, రష్మికల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. సంగీతం: వివేక్-మెర్విన్, కూర్పు: ఆంథోని, ఛాయగ్రహణం: సత్యన్ సూర్యన్.













