నెక్ట్స్ లెవెల్లో శ్రీవల్లి పాత్ర
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. పుష్ప1లో తన యాక్టింగ్ కు జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు బన్నీ. పుష్ప2లో అంతకుమించి అన్నట్టుగా చేస్తున్నాడని, ఈ సినిమాలో బన్నీ పాత్రను చాలా గొప్పగా సుకుమార్ మలిచాడని తెలుస్తోంది.
అయితే ఇన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక పాత్ర గురించి పెద్దగా డిస్కషన్స్ జరగలేదు. తాజా సమాచారం ప్రకారం, పుష్ప2లో శ్రీ వల్లి పాత్రకు చాలా ప్రధాన్యత ఉండనుందని తెలుస్తోంది. పుష్ప1లో కేవలం గ్లామర్ రోల్ కు పరిమితమైన ఈ పాత్రకు రెండో భాగంలో నటనకు చాలా ఆస్కారం ఉంటుందని యూనిట్ మెంబర్స్ అంటున్నారు.
అంతేకాదు, పుష్ప2లో రష్మిక గర్భవతిగా కనిపించబోతుందని, తల్లి సెంటిమెంట్ సీన్స్ లో కూడా రష్మిక నటించిందని ప్రచారం జరుగుతుంది. అంటే శ్రీవల్లి పాత్ర పుష్ప2లో పుష్ప1ను మించేలా ఉంటుందని అర్థమవుతుంది. రీసెంట్ గా యానిమల్ తో మంచి హిట్ అందుకున్న రష్మిక ఈ ఏడాది పుష్ప2తో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకోనుందన్నమాట.













