ఆ సార్ట్ హీరో సరసన నటించాలనేది తన కోరిక
టాలీవుడ్లో తన తొలి చిత్రం ఛలో తో మంచి హిట్‌ను అందుకున్న రష్మిక మందన్న ఆ తార్వత గీత గోవిందం తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అనంతరం దేవదాస్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో క్రేజీ బ్యూటీగా దూసుకుపోతోంది ఈ భామ. ఇటు తెలుగు అటు కన్నడంలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. అయితే తమిళంలో కూడా అవకాశాలు కావాలంటోంది రష్మిక. అందులో ముఖ్యంగా ఇలయదళపతి విజయ్ సరసన నటించాలనేది తన కోరిక అని చెబుతోంది ఈ యంగ్ బ్యూటీ. ఈ మేరకు ఆమె కోలీవుడ్‌లో ప్రయత్నాలు కూడా చేస్తోందట. మరి రష్మికు కోలీవుడ్‌లో ఛాన్స్ వస్తుందా అనేది చూడాలి.













