పుష్పలో రష్మిక ఎలా ఉండబోతుందంటే..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన లక్కీ హీరోయిన్ రష్మిక జతకట్టనుంది. వీరి కాంబోలో వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. పుష్ప సినిమాలో బన్నీ, రష్మిక పాత్రలు మునుపెన్నడూ చూడని విధంగా ఉండనున్నాయట. ఇప్పటికే సినిమాలో బన్నీ లుక్ ఎలా ఉండనుందో ఓ అంచనాకి వచ్చేశారు ఆడియన్స్. మాసిపోయిన జుట్టు, గడ్డంతో బాగా మొరటు వ్యక్తిలా కనిపిస్తున్నాడు బన్నీ. ప్రతీ సినిమాకు తన లుక్స్ లో వేరియేషన్ చూపించే బన్నీ, ఈసారి కూడా పుష్ప కోసం తన గెటప్ ను మార్చేసుకున్నాడు. ఇక ఇప్పుడు రష్మిక పాత్రకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి.
ఈ సినిమాకు సంబంధించిన ఆన్ లోకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. చూస్తుంటే అంత డీ గ్లామరస్ గా ఏమీ లేదు కానీ మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుంది రష్మిక. మరి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే బ్యాచ్ కు సుకుమార్ ఎలా సెట్ చేస్తారో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.













