ఈ సారి నాకు ఆ ఆఫర్ రాలేదు
స్టార్ హీరో విజయ్ 63వ చిత్రం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన కన్నడబ్యూటీ రష్మిక నటించనుందని అప్పట్లో టాక్ వచ్చింది. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార పేరును ప్రకటించటంతో అవన్నీ రూమ్స్ అని తేలిపోయింది. ఈ వ్యవహారంపై రష్మీక స్పందించారు. విజయ్ అట్లీ కాంబినేషన్లో రానున్న తలపతి 63వ చిత్రంలో నటిస్తున్నారా అని చాలా మంది తనను అడిగారని, కానీ ఈసారి నాకు ఆ ఆఫర్ రాలేదని పేర్కొన్నారామో. కానీ నెక్ట్స్ టైం ఈ అవకాశం వస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. కాగా త్వరలోనే కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తానని క్లారిటీ ఇచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ అనే సినిమాలో నటిస్తోంది.













