రణబాలి షూటింగ్ పూర్తి.. ఇక ఫోకస్ అంతా దానిపైనే!
రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ రణబాలి(ranabaali)పై ఆసక్తి మరింత పెరుగుతోంది. విజయ్ దేవరకొండ (vijay devarakonda)- రష్మిక మందన్నా(rashmika mandanna) జోడీకి రాహుల్(Rahul Sankrithyan) మార్క్ పీరియాడిక్ యాక్షన్ టచ్ తోడవడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్ రిలీజ్ తర్వాత వచ్చిన రెస్పాన్స్‌కు తోడు తాజాగా షూటింగ్ పూర్తైందన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడం మరో కీలక అప్డేట్గా మారింది.
దాదాపు 130 రోజుల పాటు సాగిన షూటింగ్‌ను సక్సెస్ఫుల్ గా ముగించినట్టు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన టీమ్ మొత్తంతో కలిసి రణబాలి డైలాగ్ చెప్పిన వీడియోను షేర్ చేస్తూ ఈ జర్నీకి ముగింపు పలికారు. ఇప్పటికే రష్మిక తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేయగా, ఇప్పుడు మొత్తం షూటింగ్ కంప్లీట్ కావడంతో సినిమా తదుపరి దశ పనులపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. భారీ స్కేల్లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు 130 రోజుల షూటింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇప్పుడు స్పెషల్ డిస్కషన్ గా మారింది.
మైత్రి మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మిస్తున్న ఈ సినిమాకు అజయ్(Ajay), అతుల్(Atul) సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న రణబాలికి దసరా సీజన్ కూడా కలిసిరానుంది. షూటింగ్ పూర్తవడంతో ఇక ప్రమోషనల్ కంటెంట్‌పై మేకర్స్ దృష్టి పెట్టనున్నారు. టీజర్ ఇప్పటికే కథా ప్రపంచంపై ఆసక్తిని పెంచిన నేపథ్యంలో, రిలీజ్‌కు ముందు రాబోయే అప్డేట్స్ సినిమాపై హైప్‌ను మరింత పెంచే అవకాశముంది.








