ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు .. ఆశీర్వాద దీపం వెలిగించిన మంత్రి నారా లోకేష్.
నమో జయీభవ ..విజయీభవ
– ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ఆశీర్వాద దీపం వెలిగించిన మంత్రి నారా లోకేష్.
ప్రపంచమంతా వికసిత్ భారత్ వైపు చూసేలా అభివృద్ధి,సంక్షేమం,సాధికారత, సుస్థిరతతో పాలన సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. మన దేశాన్ని అభివృద్ధిలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా నిలిపే శక్తియుక్తులన్నీ మోదీ గారికి దేవుడు ప్రసాదించాలని ప్రార్థిస్తూ.. ‘ఆశీర్వాద్ కా దియా’ (ఆశీర్వాద దీపం) వెలిగించారు. అందరి ఆశీస్సులతో ప్రధాని మోదీ గారు వందేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ఒక యజ్ఞంలా సాగుతోందని మంత్రి ప్రశంసించారు. సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ (అందరి భాగస్వామ్యంతో అందరి అభివృద్ధి) అనే నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదరికాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్నారని లోకేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.








