సిఎం కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ ఆర్జీజీ ప్రకటన
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఆయన రూపొందిస్తున్న సినిమాలపై జనం ఎలా మాట్లాడుకుంటున్నారనేది పక్కన బెడితే ఇండస్ట్రీలో మాత్రం ఆయన సినిమాలు హాట్ టాపిక్ అవుతాయి. ఆయన క్రమంగా రూటు మార్చేసి బయోపిక్స్, వెబ్ సిరీస్‌లతో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర విషయం చెప్పి జనాల్లో క్యూరియాసిటీ పెంచారు ఆర్జీవీ. వర్మ రూపొందిస్తున్న సినిమాలపై జనం ఎలా మాట్లాడుకుంటున్నారనేది పక్కన బెడితే ఇండస్ట్రీలో మాత్రం ఆయన సినిమాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆసక్తికర విషయం చెప్పి జనాల్లో క్యూరియాసిటీ పెంచారు ఆర్జీవీ. అయినా ఇవేవి పట్టించుకోని వర్మ తనకు నచ్చిందే చేస్తాడు. వివాదాలు, సంచలన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఆయన తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు. డేంజరస్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆర్జీవీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై చర్చించారు. ఏపీ టికెట్ రేట్ల విషయంలో తనకు ఇబ్బంది లేదని అలాగే తన సినిమాను ఓటీటీ, థియేటర్ రెండింటిలోనూ విడుదల చేస్తామన్నారు. అలాగే తనకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాగా నచ్చిందని, త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానని వెల్లడించాడు. దీనికి సంబంధించిన త్వరలోనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













