Jackky Bhagnani: దివాలా పుకార్లపై స్పందించిన రకుల్ భర్త

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్(Rakul Preeth) భర్త జాకీ భగ్నానీ(Jackky bhagnani) మరియు అతని ఫ్యామిలీ గత కొంత కాలంగా తీవ్ర నష్టాల్లో ఉన్నారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. జాకీ భగ్నానీ బాలీవుడ్ నిర్మాతనే విషయం తెలిసిందే. గతేడాది అతని నిర్మాణంలో అక్షయ్ కుమార్(akshay kumar), టైగర్ ష్రాఫ్(Tiger shroff) లీడ్ రోల్స్ లో బడే మియాన్ చోటే మియాన్(Bade miyan chote miyan) అనే సినిమా వచ్చి ఫ్లాప్ గా నిలిచింది. అలీ అబ్బాస్ జాఫర్(Ali Abbas Jaffer) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్క్రీన్ బాగా పేలవంగా ఉండటంతో సినిమా డిజాస్టర్ అయింది.
అయితే ఈ సినిమా ఫ్లాప్ తర్వాత భగ్నానీ దారుణంగా దివాలా తీశారని చాలా కథనాలొచ్చాయి. ఈ వార్తలపై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో జాకీ భగ్నానీ మాట్లాడారు. సినిమాల్లో నష్టపోవడం వల్ల తాను జూహూలో ఉన్న ఆఫీస్ ను అమ్మానని, కనీసం తినడానికి కూడా తన దగ్గర డబ్బుల్లేవని, అవన్నీ తట్టుకోలేక తాను పారిపోయానని కూడా వార్తలొచ్చాయని జాకీ భగ్నానీ తెలిపారు.
అయితే ఈ వార్తలన్నీ అసలెలా స్టార్ట్ అయ్యాయో తనకు తెలియదని, ఈ విషయంలో తానెవరినీ నిందించాలనుకోవడం లేదని, సినిమా ఫ్లాప్ తర్వాత తన ఫ్యామిలీ చాలా కష్టాలు ఎదుర్కొన్నది నిజమేనని, బ్యాంకుల నుంచి లోన్స్ రావడం కూడా చాలా కష్టమైందని చెప్పిన జాకీ భగ్నానీ తాను పరిస్థితులకు భయపడి ఎక్కడికీ పారిపోలేదని వెల్లడించారు.