ఆమె పాత్రను పోషించడం నా అదృష్టం
ఎన్టీఆర్ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రను పోషిస్తున్నది పంజాబీ సొగసరి రకుల్‌ప్రీత్‌సింగ్. భారతీయ చిత్రసీమకు గర్వకారణమైన అందాల అభినేత్రి శ్రీదేవి పాత్రను పోషించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిందీ సుందరి. ఆమె మాట్లాడుతూ నాకు లభించిన అరుదైన గౌరవమిది. తొలుత దర్శకనిర్మాతలు శ్రీదేవి పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు ఒక లెజెండరీ నటి పాత్రకునేను న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. వారిచ్చిన భరోసాతోనే సినిమాకు అంగీకరించాను. శ్రీదేవి భారతీయులందరి అభిమానం చూరగొన్న గొప్ప నటి. ఆమె పాత్రను పోషించడం నాపై మరింత బాధ్యతను పెంచింది. శ్రీదేవి పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేయగలననే నమ్మకం ఉంది. నా కెరీర్లో మధురమైన జ్ఞాపకంగా నిలిపోయే చిత్రమవుతుంది అని చెప్పింది.













