వెస్ సిరీస్‌లో నటించేందుకు రకుల్ గ్రీన్ సిగ్నల్
తెలుగునాట అగ్ర కథానాయికలందరూ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా మెరిసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వెబ్ సిరీస్‌లు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రకుల్‌ప్రీత్ సింగ్ కూడి వెబ్ సిరీస్‌లో చేరబోతుంది. డిజిటల్‌కి సంబంధించి ఇప్పటికే చాలా ఆఫర్స్ వస్తున్నాయి. కానీ నాకు బిన్ స్క్రీన్ అంటేనే ఇష్టం. అయితే వెబ్ సిరీస్ అనేది మనకొక కొత్త దారి. మనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకునేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి అందులో నటించాలంటే పూర్తిగా పాత్ బ్రేకింగ్ స్క్రిప్ట్‌లు, పాత్రలు రావాలి. అలాంటి వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తా. సినిమాల్లో చేయలేనివి.. అందులో చేస్తా అని రకుల్ తెలిపింది. ఇదిలా ఉంటే వెబ్ సిరీస్‌లో రకుల్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ ఏడాది ఐదు సినిమాల్లో నటించగా, ఏ ఒక్క చిత్రం కూడా రకుల్‌కి సక్సెస్‌ని అందించలేకపోయింది. ప్రస్తుతం భారతీయుడు 2, అర్జున్ కపూర్ సినిమా, జాన్ అబ్రహాం చిత్రంలో నటిస్తోంది.













